ETV Bharat / state

రాష్ట్ర ప్రజల చూపంతా ఆ నియోజకవర్గాల ఫలితాల వైపే!

సీఎం ఎవరవుతారనే విషయం పక్కనపెడితే కొన్ని నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు గెలుస్తారనే విషయంపైనే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంలో.... రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఓటరు ఎటువైపు..ఎవరికి పట్టంకట్టాడు అని రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.

author img

By

Published : May 23, 2019, 8:30 AM IST

గెలుపు గుర్రమెవరు?

ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఉత్కంఠ రేపాయి. ముఖ్యంగా..జమ్మలమడుగులో తెదేపా తరఫున రామసుబ్బారెడ్డి, వైకాపా తరపున సుధీర్‌రెడ్డి పోటీ చేశారు. ఏళ్ల తరబడి వైరి వర్గాలుగా పోరాడిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల ఒకేతాటిపైకి రావడంతో..ఇక్కడి రాజకీయం అనూహ్యంగా మారింది. కడప జిల్లాలో నిజమైన ముఖాముఖి పోరు వైకాపా, తెదేపాల మధ్య జరుగుతున్న స్థానాల్లో జమ్మలమడుగు అగ్రస్థానంలో ఉంది.

గుడివాడలో గెలుపెవరిది?
ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన మరో స్థానం కృష్ణా జిల్లా గుడివాడ. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ని తెదేపా తరపున బరిలో ఉన్నారు. సినీ నిర్మాత, వైకాపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని నాలుగో సారి బరిలో దిగారు. నాని ఇప్పటికే వరుసగా ఇక్కడ మూడు సార్లు గెలిచారు. అవినాష్‌ స్థానికేతరుడన్న ముద్ర తొలగించుకునేందుకు తన నివాసాన్ని గుడివాడకు మార్చుకుని... సీనియర్‌ నేతలతో కలసి ఉద్ధృతంగా ప్రచారం చేశారు. జనసేన అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవడంతో.. ఇక్కడ ప్రధానంగా తెదేపా, వైకాపా మధ్యే పోటీ నెలకొంది. డివాడలో గెలుపు ఎవరిదో కొద్ది గంటల్లో తేలిపోనుంది.

విజయ గంట మోగేనా?
విశాఖ ఉత్తరం కూడా అందరిలో ఆసక్తిని పెంచింది. ఇక్కడ తెదేపా తరఫున మంత్రి గంటా శ్రీనివాసరావు, భాజపా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, వైకాపా, జనసేనల నుంచి కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోరు నెలకొంది. మంత్రి గంటాకు రాజకీయాలు, ఎన్నికల విషయాల్లో మంచి వ్యూహకర్తగా పేరుంది. తీవ్రమైన విషయాలనూ గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించి అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట. గంటా తరఫున స్వచ్ఛందంగా పనిచేసే స్నేహితుల బలం, బలగం ఉంది. సొంత సామాజికవర్గ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆయనకు కలిసొస్తున్న మరో అంశం. ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి.

బలరామ-కృష్ణ పోరు
‍‍
ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గం చీరాల. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి..తర్వాత సైకిలెక్కిన ఆమంచి కృష్ణమోహన్..ఎన్నికలకు ముందు వైకాపా గూటికి చేరి ఫ్యాన్‌ గుర్తుతో బరిలో నిలిచారు. తెలుగుదేశం ఇక్కడ సీనియర్‌ నేత కరణం బలరాంను రంగంలోకి దించింది. 2014లో తెదేపా నుంచి పోటీచేసిన పోతుల సునీతతో పాటు..మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు, వైకాపా టికెట్‌ ఆశించి భంగపడ్డ ఎడం బాలాజీ.. వీరంతా బలరాంకు అండగా నిలిచారు. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో తనకున్న బలంతో పాటు జగన్‌ సహకారంతో హ్యాట్రిక్‌ గెలుపు తథ్యమన్నది ఆమంచి ధీమా. సొంత నియోజకవర్గమైన అద్దంకిని కాదని తొలిసారి చీరాలకు మారిన బలరాంకి స్థానచలనం ఏమేరకు ఫలితాన్నిస్తుందో వేచిచూడాలి
బాలయ్య మళ్లీ విజయ భేరీ మోగిస్తాడా?
కొందరు ప్రముఖులు పోటీ చేసిన స్థానాలు కూడా ఓటర్ల దృష్టిని ఆకర్షించాయి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి హిందూపురం... నందమూరి కుటుంబానికి కంచుకోటగా మారింది. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. తెదేపాను స్థాపించిన అనంతరం ఎన్‌టీ రామారావు ఇక్కడ నుంచి 3 సార్లు గెలుపొందారు. 1983 నుంచి ఒక ఉప ఎన్నిక సహా 9 సార్లు తెదేపానే గెలిచింది. రాయలసీమ ఐజీగా పదవీ విరమణ పొందిన ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌ను ఇక్కడ .. వైకాపా అభ్యర్థిగా నిలిపింది. హిందూపురంలో ఎక్కువ సంఖ్యలో ఉండే మైనార్టీ ఓట్లపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.

'గాజు'వాకను గెలిచేనా?
‍రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్న నియోజక వర్గం గాజువాక. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేయడమే ఇందుకు కారణం. ఇక్కడ తెదేపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మరోసారి బరిలో దిగారు. వైకాపా నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేశారు. పవన్ పోటీతో గాజువాకలో ముక్కోణపు పోటీ నెలకొంది. వైకాపా అభ్యర్థి నాగిరెడ్డి సోదరుడి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి వైకాపా నుంచి తెదేపాలో చేరడం తమకు లాభించే అంశమని తెదేపా భావిస్తోంది. పవన్ కల్యాణ్‌ రాజకీయ భవితవ్యం ఈ ఎన్నికపైనే ఆధారపడి ఉంది. పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనూ పోటీ చేసినా..అక్కడితో పోలిస్తే విజయావకాశాలు ఇక్కడే ఎక్కువని భావిస్తున్నారు.
పులివెందుల పోరు
వైకాపా అధ్యక్షుడు జగన్‌... పులివెందుల నుంచి మరోసారి బరిలో నిలిచారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో YS కుటుంబమే ప్రాతినిథ్యం వహిస్తోంది. 2014లో జగన్‌.. సీమాంధ్రలోనే అత్యధికంగా 75వేల 243 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తెలుగుదేశం తరఫున సతీశ్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మరోసారి చంద్రోదమయ్యేనా?
కుప్పం..తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీచేస్తున్న నియోజకవర్గం. 1989 నుంచి వరసగా 6 సార్లు చంద్రబాబు విజయం సాధించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో రాష్ట్రంలో ప్రత్యేకత ఏర్పడింది.

Intro:ATP:- సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో కౌంటింగ్ ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఎన్నికలు వివి ఫ్యాట్ స్లిప్పుల కౌంటింగ్ నియోజకవర్గాల సమీపంలో పోలీసు బలగాలతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ చేయడానికి అధికారులను ఒకవైపు, ఏజెంట్లను ఒకవైపు పరిశీలించి లోనికి అనుమతిస్తున్నారు.

Body:అనంతపురం పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీల ఏజెంట్లను పరిశీలించి అనుమతించారు. సాంగ్ రూముల నుంచి ఇవి ఎం.వి.వి పేర్లను తీసుకువచ్చి మరికొద్ది సేపట్లో అనంతపురంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.