రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి-నాడు నేడు మొదటి దశ పనులను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన నేతృత్వంలో ఉన్నతాధికార బృందం పరిశీలించింది. కృష్ణ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పనులు, నిర్వహణ, నిధుల వినియోగం, తల్లిదండ్రుల కమిటీ పాత్ర తదితర విషయాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు నాయక్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ పథక లక్ష్యాన్ని, అమలు తీరును ప్రధానోపాధ్యాయులు వారికి వివరించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణి తెహెరా బేగం, విజయవాడ ఉపవిద్యాశాఖాధికారిణి యల్.చంద్రకళ, మండల విద్యాశాఖాధికారి బాలాజీ నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఇదీచదవండి
MANSAS TRUST: చీకటి జీవోలిచ్చే సర్కార్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు