మూడు రాజధానులకు ప్రజా మద్దతుపై రెఫరెండంకు వైకాపా సిద్ధమా అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ ప్రణవ్ గోపాల్ సవాల్ చేశారు. వైకాపా చెప్పే ఉత్తరాంధ్ర అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. మంత్రి పదవి కోసం గుడివాడ అమర్నాథ్ రెడ్డి అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు.
విజయసాయిరెడ్డి భూదందాలో వాటా దక్కట్లేదనే నిరాశతో తెదేపాని నిందిస్తున్నారని ఆరోపించారు. అక్రమార్కులతో బేరం కుదిరినందుకే విశాఖ భూదందాలపై సిట్ నివేదికను బయటపెట్టట్లేదా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు వైకాపాకు లేదని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: