తెలంగాణ వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం భాంజిపేటలో విషాదం జరిగింది. సోదరుని అంత్యక్రియలకు వెళ్లిన ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన భూషణపోయిన సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం అందరూ చెరువులో స్నానానికి దిగారు. మృతుని చిన్నాన్న కుమారుడైన సమ్మయ్య చెరువులో స్నానం చేస్తూ ఈదుకుంటూ చెరువులోపలికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీట మునిగాడు. గమనించిన మిగతావారు ఒడ్డుకుతీసుకురాగా... అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి: పాలదుకాణంలో చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు