ETV Bharat / state

'3 రాజధానులు... రాష్ట్రానికి మరణ శాసనమే' - tnsf Conference in Vijayawada

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్​ఎస్​ఎఫ్) మేధోమథన సదస్సుకు హాజరైన ఆయన... మూడు రాజధానుల నిర్ణయంపై మండిపడ్డారు.

Telugunadu Student Federation Conference in Vijayawada
టీఎంఎస్ఎఫ్ సదస్సుకు హజరైన చంద్రబాబు
author img

By

Published : Feb 18, 2020, 5:05 AM IST

Updated : Feb 18, 2020, 11:37 AM IST

విజయవాడలో తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ సదస్సు

మూడు రాజధానుల విధానం రాష్ట్రానికి మరణశాసనమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ 9 నెలల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మంచౌదరి అధ్యక్షతన తెలుగునాడు విద్యార్థి సమాఖ్య మేధోమథన సదస్సు సోమవారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. తెదేపా హయాంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని.... 5.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ఇప్పుడు జగన్ పాలన చూసి రూ.1.80 లక్షల కోట్ల ఒప్పందాలను రద్దు చేసుకుని... పొరుగు రాష్ట్రాలకు సంస్థలు తరలివెళ్లాయన్నారు. పెట్టుబడులు రాకపోతే యువతకు ఉద్యోగాలేలా వస్తాయని ప్రశ్నించారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో మూడు రాజధానులపై సెమినార్ నిర్వహించడమేంటని మండిపడ్డారు.

టీఎన్​ఎస్​ఎఫ్​ను బలోపేతం చేస్తాం

సమాజానికి ఎంతో కొంత సేవలందించాలని యువతకు చంద్రబాబు సూచించారు. సరైన వ్యక్తిని సరైన స్థానంలో నియమించేలా దృష్టి పెడతానన్నారు. త్వరలో విశ్వవిద్యాలయాల్లో టీఎంఎస్ఎఫ్ శాఖల ఏర్పాటుపై శ్రద్ధ వహిస్తామని వెల్లడించారు. అమరావతి రాజధాని రైతులకు అండగా నిలబడాలని విద్యార్థులకు సూచించారు. సమర్థులైన నాయకులతో తెలుగునాడు విద్యార్ధి ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్)ను పటిష్ఠంగా తీర్చిదిద్దుతామని తేదేపా అధినేత చంద్రబాబు తెలిపారు.

ఇదీచూడండి.రేపు జగ్గయ్యపేటలో పైలట్ ప్రాజెక్టుగా భూముల రీసర్వే

Last Updated : Feb 18, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.