ద్రవ్య వినిమియ బిల్లుకి తెలుగుదేశం అడ్డుపడిందని మంత్రులు, వైకాపా నాయకులు చెప్పడం దారుణమని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. మొన్నటి సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లు పెట్టండి అని పట్టుబట్టింది తెదేపానే అని గుర్తు చేశారు. కానీ మంత్రులు ఆ బిల్లును పెట్టకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. ఇప్పుడు నెపాన్ని తమ మీద నెడుతున్నారని తప్పుబట్టారు.
వైకాపా నాయకులు అవినీతిలో ప్రయాణం చేస్తున్నారని.. ఏదో రోజు మునిగిపోవడం ఖాయమని అశోక్ బాబు విమర్శించారు. రెండు రోజుల్లో మండలి మినిట్స్ బయటకి వస్తాయన్న అశోక్ బాబు.. బిల్లుకు అడ్డుపడింది ఎవరనేది అప్పుడు ప్రజలకు తెలుస్తుందన్నారు.
ఇదీ చదవండి
రాజ్యాంగం ప్రకారం ఎవరి పరిధిలో వాళ్లుండాలి: సభాపతి తమ్మినేని