గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పుట్టినరోజు సందర్భంగా... కృష్ణాజిల్లా ఎనికేపాడు మండలంలో తెదేపా కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. కొందరు నేతలు కక్షసాధింపు చర్యగా ఆ బ్యానర్లు తొలగించారని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. ఫలితంగా.. అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇదీ చదవండి...