ETV Bharat / state

'తితిదేపై ఏం చెప్పారు..!ఇప్పుడేం చేస్తున్నారు..!'

తితిదేలో వైకాపా ప్రభుత్వం నియమించిన 29 మంది సభ్యుల పాలకమండలిపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. సామాజిక న్యాయం ప్రకారం బోర్డు సభ్యులను నియమిస్తామన్న నేతలు, ఇప్పుడు చేసింది ఏంటని ప్రశ్నించారు.

తితిదే బోర్డు సభ్యులు
author img

By

Published : Sep 20, 2019, 4:03 PM IST

'తితిదే బోర్డు సభ్యుల నియామకాల్లో వైకాపా మాట మార్చింది'

తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులుగా 75 శాతం స్థానికులకు అవకాశం ఇస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందని తెదేపా ఎమ్మెల్సీ, కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆరోపించారు. తెదేపా హయాంలో బోర్డు సభ్యునిగా శేఖర్ రెడ్డిని నియమిస్తే తప్పుబట్టిన వైకాపా, ఇప్పుడు అదే శేఖర్ రెడ్డిని ఎక్స్ అఫీషియోగా నియమించడాన్ని..ఎలా అర్దం చేసుకోవాలని ప్రశ్నించారు. సామాజిక న్యాయం ప్రకారం నియామకాలు జరుపుతామని శాసనసభ, శాసనమండలిలో చెప్పిన మాటలు ఏమైయ్యాయని ఆయన మండిపడ్డారు.

ఇదీ చూడండి : 'ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగులను దగా చేశారు'

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
శివకాంత్(EJS)
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_20_Rahadari_Kastaalu_Pkg_AP10004

Body:తేలికపాటి వర్షానికి అనంతపురం జిల్లా కదిరి లోని రహదారులు అధ్వానంగా మారుతున్నాయి . ప్రధాన రహదారులపై అడుగుల లోతు గోతులు వాహన చోదకులకు చుక్కలు చూపిస్తున్నాయి.వర్షం వచ్చిన ప్రతిసారి పట్టణ వాసులకు రహదారులు చిక్కులు తప్పడం లేదు కదిరి నుంచి హిందూపురం ,బెంగళూరు వైపు వెళ్లే ప్రధాన రహదారిలో రెండు మూడు చోట్ల తరచూ రహదారి గుంతల మయంగా మారుతోంది. చిరుజల్లులతో ఈ రహదారి చిత్తవుతోంది. ఫలితంగా వాహనచోదకులు తో పాటు పాదచారులకు కష్టాలు తప్పడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ లో నుంచి వాహనాలు బయటకు వచ్చే చోట మోకాలు లోతు గుంతలు ఏర్పడ్డాయి. వాళ్లు వచ్చినప్పుడు నీళ్లు తాగితే రహదారి మొత్తం మడుగులా తయారవుతుంది. అందులోనికి వెళ్లాలన్న, బయటకు రావాలి అన్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కోనేరు కూడలి సమీపంలో ఇదే పరిస్థితి నెలకొంది. శని ఆదివారాలలో వర్షాలు వస్తే నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు అధ్వానంగా మారిన రహదారితో అవస్థలు పడాల్సి వస్తోంది. పట్టణంలోని నల్లగుట్ట వీధి ప్రాంతం నుంచి చి షిరిడి సాయిబాబా గుడికి వెళ్లే మార్గంలో రహదారి మొత్తం పిల్ల కాలువలు తలపిస్తోంది. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి వద్ద వర్షపు నీటికి మురుగునీరు తోడై మడుగులా మారుతోంది ఈ పరిసర ప్రాంతాల్లోని చిన్నపిల్లలు నీటి గుంటలో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు వాహనచోదకులు ఈ మార్గంలో నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు అధికారులు స్పందించి తాత్కాలిక చర్యలు కాకుండా రహదారులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు

Conclusion:బైట్స్
నిషాంత్, కదిరి
సోమనాథ ఆచారి, కదిరి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.