విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి విజయవాడ కనకదుర్గ అమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, వేదపండితులు స్వాత్మానందేంద్రకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పవిత్ర కార్తిక పౌర్ణమి పర్వదినాన అమ్మవారి దర్శనం సంతోషంగా ఉందని స్వామి తెలిపారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: