మంత్రి కొడాలి నాని కుటుంబీకులు నిర్మించిన కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొడాలి నాని దంపతులు పాల్గొన్నారు. మంత్రి, ఆయన సతీమణి స్వామి వారిని ప్రతిష్టించి, ధ్వజ స్తంభ స్థాపన చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాధవీలత దంపతులతో కలిసి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు.
స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభ స్థాపన పూర్తయ్యాక వేద పండితులు, అర్చకులు వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి పేర్నినాని, పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ హాజరై.. స్వామి వారికి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలో శ్రీవారి వలే ఇక్కడ ఆలయంలోని త్రిమూర్తులను ప్రతిష్టించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. స్వామివారిని చూసేందుకు కన్నుల పండువగా ఉందన్నారు.
ఇదీ చదవండి: 'తిరుమల శ్రీవారి నిధులు దారి మళ్లుతున్నాయి'