ETV Bharat / state

రాష్ట్ర  కేబినెట్ కీలకాంశాలు - రాష్ట్ర  కేబినెట్

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం 6 గంటలపాటు కొనసాగింది.

state-cabinate-
author img

By

Published : Feb 1, 2019, 6:57 AM IST

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 6 గంటల పాటు కొనసాగింది. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో, ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. పోలవరం, వంశధార ప్రాజెక్టులలోని నిర్వాసితులపై పెట్టిన కేసులు కూడా మాఫీ చేయటానికి ఆమోదం తెలిపింది.

కీలకాంశాలు....
ఫిబ్రవరి 9న భారీయెత్తున 4లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు కేటాయింపు.... విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 33 మంది ఖైదీలకు విముక్తి కల్పించాలని నిర్ణయించారు. ఈబీసీలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం అంగీకరించింది. బేడా-బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలన్న శర్మ కమిషన్ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

state-cabinate-
undefined

మహిళా రుణాలు...

డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ -2 పథకం ద్వారా అదనంగా 10 వేల రూపాయలు జారీ చేసిన ఉత్తర్వులను కేబినెట్ ఆమోదించింది. 3 విడతల్లో 2500, 3500, 4000 రూపాయలుగా పంపిణీ చేయనున్నారు.
విద్యుత్ వరాలు....
నాయీ బ్రాహ్మణుల (బార్బర్లు) హెయిర్ కటింగ్ సెలూన్స్‌కు 150 యూనిట్ల విద్యుత్ వరకు ఉచితంగా కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎంబీసీలకు 100 యూనిట్లు , చేనేత కార్మికులకు 150 యూనిట్లు ఇచ్చేలా అంగీకరించింది. డ్రైక్లీనింగ్‌కు ఉచిత విద్యుత్ అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

భూధార్ విషయాలు....
దేశంలోనే తొలిసారిగా వ్యక్తులకు ఆధార్ తరహాలో భూ స్థిరాస్థులకు కూడా 11 అంకెల ప్రత్యేక సంఖ్యతో కూడిన కార్డును అందించేందుకు ‘భూధార్’ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించేందుకు అవసరమైన సవరణ బిల్లు ముసాయిదాకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రిజిస్ట్రేషన్ (ఆంధ్రప్రదేశ్ అమెండ్‌మెంట్) బిల్-2018 పేరుతో ప్రస్తుత శాసనసభ సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సింహాచలం భూముల్లో ఇళ్ల క్రమబద్దీకరణ జాప్యంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.రాజధాని అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధి పథకానికి కేబినేట్ ఆమోదించింది.

పరిశ్రమల ప్రదేశ్....
కియా మోటార్స్ తొలికారు విడుదల చారిత్రాత్మక అంశమన్న ముఖ్యమంత్రి ... ప్రత్యేకించి పరిశ్రమల శాఖను అభినందించారు. అభినందనలను మంత్రిమండలిలో రికార్డ్ చేయాలని సూచించారు. కియా తమ ద్వారానే వచ్చిందన్న భాజపా వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో వోక్స్ వ్యాగన్ ను రాష్ట్రానికి దూరం చేశారని విమర్శించారు. అశోక్ లేలాండ్, ఇసుజు, హీరో మోటాకార్ప్, అపోలో టైర్స్ తమ ప్రభుత్వంలోనే వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆటో మొబైల్ హబ్​గా రూపొందిస్తున్నామని తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.