కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి.. మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంటి వద్ద అతడు ఒంటరిగా ఉంటున్నాడు. వైరస్ సోకిందనే భయంతో మానసిక వేదనకు గురవుతున్నాడు. సోమవారం రాత్రి పురుగుల మందు తాగి మరణించాడు. వైరస్ భయంతో.. అంత్యక్రియలు నిర్వహించడానికి మృతుడి బంధువులు వెనకడుగు వేశారు. బంధువుల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు అవనిగడ్డ ఎస్సై సందీప్ పీపీఈ కిట్ ధరించి అంత్యక్రియలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. తహసీల్దార్ సమక్షంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్నారు.అంత్య క్రియలు నిర్వహించిన ఎస్సైను.. గ్రామస్థులు, పోలీసు అధికారులు అభినందించారు.
ఇదీ చదవండి: