కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామం వద్ద కారులో తరలిస్తున్న గంజాయి, గుట్కా, మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. రూ. 11 లక్షలు విలువ చేసే గుట్కాలు, 4 కేజీల గంజాయి, 24 ఫుల్ బాటిల్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కారు, ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి... నలుగురిని అరెస్టు చేసినట్లు నందిగామ డీఎస్పీ రమణ మూర్తి వెల్లడించారు. సీఐ సతీష్, చందర్లపాడు ఎస్ఐలకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అవార్డులు రివార్డులు ప్రకటించగా.. వాటిని డీఎస్పీ అందజేశారు.
ఇదీ చూడండి: