రాష్ట్ర సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ప్రధాన కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.రమేశ్ కుమార్ నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్గా రేపాల శ్రీనివాసరావును నియమించారు.
వీరివురిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమించినట్లు సీఎస్ నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడు ఏళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు సర్వీసు నిబంధనల మేరకు వీరు పదవుల్లో కొనసాగుతారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాజ్యాంగం ప్రకారం ఎవరి పరిధిలో వాళ్లుండాలి: సభాపతి తమ్మినేని