కరోనా నేపథ్యంలో మార్కెట్‌లో విరివిగా లభ్యమవుతున్న శానిటైజర్లు తాగి కొందరు బడుగు జీవులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. విజయవాడలో శానిటైజర్ తాగి చనిపోయినవారిజాబితా పెరిగిపోతోంది. కొత్తగా మరో ఇద్దరు మరణించారు. కొత్తపేటరాజు గారి వీధిలో సీరం నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యానికి బానిసై శానిటైజర్ సేవించి.. తీవ్ర కడుపు మంటతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. వించిపేటకు చెందిన తోటకూర బాగ్యరాజు.. మద్యానికి బానిసై శానిటైజర్ సేవించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
వాడకం మితిమీరడంతో అవయవాలు పాడై..
మద్యం ధరలు అధికంగా ఉండటం.. తక్కువ ధరకు లభించే శానిటైజర్ల ఎక్కడంటే అక్కడ విరివిగా దొరుకుండటంతో.. కూలీలు, బడుగు జీవులు వీటిని కొని తాగేస్తున్నారు. గతంలో వైట్నర్, చీప్‌లిక్కర్ అలవాటు పడిన వారు.. ఇప్పుడు శానిటైజర్ తాగుతున్నారు. ఆ తర్వాత వాంతులు, విరేచనాలతో.. ఆసుపత్రిలో చేరుతున్నారు. వాడకం మితిమీరడంతో అవయవాలు పాడై మృత్యువాత పడుతున్నారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసుశాఖ.. ఔషధ దుకాణ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసింది. శానిటైజర్ తాగితే కలిగే దుష్పరిణామాలు వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు .
శానిటైజర్ తాగడం వల్ల.. గుండె, ఉదరకోశ సమస్యలతోపాటు.. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు
ఇవీ చూడండి...: విజయవాడ కనకదుర్గ గుడి వెబ్సైట్ నిలిపివేత