ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్నీ ఒక్కో జిల్లాగా చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో నూజివీడు ఏలురు జిల్లాలో కలుస్తుందన్నారు. నూజివీడును కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ చౌక్‌లో ధర్నా చేపట్టారు. నూజీవీడు వాసులకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని...వ్యాపార, ఉద్యోగాలపరంగా రాకపోకలు కొనసాగిస్తుంటారని...సాధన సమితి గౌరవ సలహాదారు చలసాని వెంకట రామారావు అన్నారు.
నూజివీడును ఏలూరు జిల్లాలో కలపటంతో డివిజన్ స్థాయి నుంచి మండల స్థాయికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో మచిలీపట్నం, గుడివాడ కేంద్రంగా 2రెవెన్యూ డివిజన్లు, విజయవాడ కేంద్రంగా మరో రెండు రెవెన్యూ డివిజన్లతో జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలిసి నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ వినతిపత్రం అందజేస్తామన్నారు.
ఇదీ చదవండి: