కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను.. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు ఈ రైతు బజార్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలకు.. కూరగాయలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రైతుబజార్ల సంఖ్యను పెంచారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల పట్టిక ప్రకారమే కూరగాయలు విక్రయించాలని సూచించారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: