ETV Bharat / state

విజయవాడలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు - కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్ తాజా వ్యాఖ్యలు

విజయవాడలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ప్రదర్శనను రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌, ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్‌ జె.పద్మాజనార్దనరెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌ జెండా ఊపి ప్రారంభించారు. విద్యుత్ పొదుపు అవశ్యకత తెలియజేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

National Energy Conservation Week
విజయవాడలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు
author img

By

Published : Dec 14, 2020, 3:35 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ప్రదర్శనను రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌, ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్‌ జె.పద్మాజనార్దనరెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌ జెండా ఊపి ప్రారంభించారు. మానవాళి మనుగడకు సహజ వనరులను పొదుపుగా, సమర్ధంగా వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వాటిలో విద్యుత్తు వినియోగం చాలా ముఖ్యమైందనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలకు వివరించడమే ఈ వారోత్సవాల లక్ష్యమని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు అందించాలంటే వృథాను అరికట్టడం కూడా అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం కావాలని జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌ కోరారు.

ఇవీ చూడండి...

తన వారి కోసమే ఉపాధ్యాయ బదిలీలకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణ: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.