నాడు – నేడులో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనుల నాణ్యతపై రాజీపడొద్దని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకూ ఫర్నీచర్, ఫ్యాన్లు, శానిటరీ తదితర మెటీరియల్స్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు.
సెప్టెంబర్ 5 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశముందని, ఆలోగా 7 నుంచి 10 తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. సచివాలయం నుంచి నాడు నేడుపై సమీక్షించిన మంత్రి మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయలు, అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఆగస్టు మొదటి వారానికి రాష్ట్రంలో గుర్తించిన 30 డెమో స్కూల్స్ లో నాడు – నేడు పనులు పూర్తిచేసి తరగతులకు సర్వం సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: