కరోనా చికిత్సకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తానని.., అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు వైద్యశాలలో చేస్తున్నామని.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైద్యశాలకు 20 ఆక్సిజన్ సిలిండర్లను మంత్రి అందజేశారు. వాటిలో 10 సిలిండర్లను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అందజేయగా.. మిగిలిన 10 సిలిండర్లను మంత్రి ఆదిమూలపు సురేష్ అందజేశారు. కొవిడ్ కేర్ సెంటర్లో పేషెంట్లను పూర్తి స్థాయి అబ్జర్వేషన్లో వైద్యులు చూసుకోవాలని సూచించారు. నిర్దేశించిన మెనూ ప్రకారం మంచి ఆహారాన్ని అందించాలని చెప్పారు. అవసరమైన వసతుల కోసం.. ఎవరి వంతుగా వారు కృషి చేసి.. సకాలంలో ప్రజలకు సేవలు అందేలా చూడాలని స్థానిక నాయకులకు మంత్రి సూచించారు.
ఇవీ చూడండి…: ఆక్సిజన్ సిలిండర్ వాహనాలు ప్రారంభించిన కలెక్టర్ పోలా భాస్కర్