విజయవాడ ముత్యాలంపాడు పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఎదుట.. గొర్రెల పెంపకం దార్ల సహకార సంఘం సభ్యులు ఆందోళన చేపట్టారు. సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయాలని సంఘం చైర్మన్ గొరిపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండా కొత్త ఛైర్మన్ ను నియమించారని ఆరోపించారు.
అధికారపార్టీ ప్రజాప్రతినిధుల సూచనలను పాటిస్తూ.. పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రస్తుత ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు. గతంలో హైకోర్టుకి వెళ్ళి పదవిపై స్టే తెచ్చుకున్నప్పటికి జిల్లా మంత్రుల ఒత్తిడి మేరకే జేడీ ఇలాంటి అనాలోచిత చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సర్వసభ్య సమావేశం ఆలోచన విరమించుకోవాలని కోరారు.
ఇవీ చూడండి:
పొదుపు చేసిన మెుత్తానికి రెట్టింపు ఇస్తామని కోట్లకు కుచ్చుటోపీ!