వైకాపా నాయకులు బురద రాజకీయం మాని ముందు వరద బాధితులను ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ హితవు పలికారు. లంక గ్రామాలు మునిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
కంద, పసుపు, పత్తి, మినుము, అరటి, మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. సీఎం జగన్ రెడ్డి చెబుతున్న నష్ట పరిహార అంచనా.. కేవలం పత్రికల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనపడటం లేదని విమర్శించారు. త్వరితగతిన అంచనా నివేదికలు పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: