కరోనా రోగులకు ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించటంలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గిస్తామని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యం గురించి రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా 800 మంది వైద్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు .
కొంతమంది రోగులు నేరుగా ఆసుపత్రికి రావటంతో బెడ్లు కేటాయించటం సమస్యగా మారుతుందన్నారు శివశంకర్. విజయవాడ ఆసుపత్రిలో ప్రస్తుతం 480 పడకలు ఉన్నాయని.., 97 శాతం ఆక్యుపెన్సీ ఉందన్నారు. కొవిడ్ బాధితులకు వైద్య సహాయం కావాల్సిన వారు 08662474803, 04 నెంబర్లుకు ఫోన్ చేయాలని సూచించారు.
ఇదీచదవండి