కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరోనా కలకలం నెలకొంది. ఐదు రోజుల నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌కు పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకున్నారు. అధికారుల అదేశాల మేరకు శనివారం నుంచి 3 రోజులపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయం మూసివేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి : తక్షణ సాయం కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ లేఖ