Jagan Government Election Stunt : ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మూలనపడేసిన పాత దస్త్రాలకు సీఎం జగన్(CM Jagan) దుమ్ము దులుపుతున్నారు. కరోనా సాకు చెప్పి రెండేళ్లకు పైగా మూసివేసిన ఉర్దూ గ్రంథాలయాలు, కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను తెరపైకి తెచ్చారు. ముస్లిం ఓట్లకు గాలం వేసేందుకు కొత్త పన్నాగం పన్నారు. ఇన్ని రోజులు ఉర్దూ గ్రంథాలయాలకు కనీసం అద్దె కాదు కదా.. కనీసం పేపర్ బిల్లులు కూడా పట్టించుకోని జగన్ సర్కార్‌కు అకస్మాత్తుగా ముస్లిం యువత గుర్తుకురావడం ఆశ్చర్యంగా ఉందని ముస్లిం సామాజికవర్గం విమర్శిస్తోంది.
Prathidhwani: జగనన్న నాలుగేళ్ల పాలనలో పేదలకు దక్కిన సంక్షేమం ఎంత?
Muslim Youth సీఎం జగన్‌కు ఉన్నట్టుండి ఒక్కసారిగా ముస్లిం యువత గుర్తొచ్చారు. వారికి నైపుణ్య శిక్షణ అందించాలంటూ అధికారులకు హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు. మైనార్టీ ఆర్థిక సంస్థ ద్వారా ఇవ్వాల్సిన స్వయం ఉపాధి రుణాలను అధికారంలోకి రాగానే నిలిపివేసిన వైసీపీ సర్కార్... ఎన్నికలకు మరో 8 నెలలే ఉండటంతో అకస్మాత్తుగా ముస్లింల సంక్షేమం(Muslims Welfare) గుర్తొచ్చింది. ఇన్నాళ్లుగా మూలన పడేసిన 36 ఉర్దూ గ్రంథాలయాలు, కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను తెరవాలని సీఎం ఆదేశించారు. అందులోనూ మళ్లీ కొతలు విధించారు.. గతంలో ఏడాదికి రెండు విడతల్లో 120 మంది ముస్లిం యువతకు శిక్షణ ఇవ్వగా.. తాజాగా ఆ సంఖ్యను 60కి కుదించారు.
Chandrababu Vision : పేదల సంక్షేమం, యువత ఉపాధికి ప్రత్యేక విధానాలు : చంద్రబాబునాయుడు
Urdu Acadamy తెలుగుదేశం హయాంలో చేపట్టిన ఏ సంక్షేమ పథకం కొనసాగించడానికి జగన్‌కు సుతారమూ ఇష్టం లేదు. అది ఎంత మంచి పథకమైనా నిర్దాక్షిణ్యంగా నిలిపేయడమే ఆయన ఆలోచన. అందులో భాగంగానే ముస్లిం యువత శిక్షణ కేంద్రాలనూ మూసేశారు. ఉర్దూ భాషాభివృద్ధే లక్ష్యంగా.. 1975లో ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ముస్లిం యువత కోసం 2000 సంవత్సరంలో గ్రంథాలయాలను విస్తరించి కంప్యూటర్ శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. ఆయా కేంద్రాల్లో ఉర్దూను పదో తరగతిలో ఒక సబ్జెక్ట్‌గా ఉత్తీర్ణులైనవారికి శిక్షణ అందించేవారు. 2014-19 మధ్య ప్రతి సంవత్సరం 100 మందికి తగ్గకుండా 36 కేంద్రాల్లో సుమారు 18 వేల మందికి శిక్షణ అందించారు. ఇక్కడ శిక్షణ పొందిన ముస్లిం యువకులు ఎంతో మంది గల్ఫ్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. దీనిపై కక్షగట్టిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా సాకు చూపి వీటన్నింటినీ మూసివేశారు.
Computer Training గ్రంథాలయాలు, కంప్యూటర్ శిక్షణ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు ఏటా 5 కోట్ల వరకు ఖర్చవుతుంది. 25 నెలలుగా ఈ సొమ్ములు చెల్లించలేదు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న గ్రంథాలయాలకు కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో... ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఇటీవలే ప్రభుత్వం బకాయిలను చెల్లించింది. గ్రంథాలయాలకు కనీసం పత్రికల బిల్లులు కూడా చెల్లించ లేదు. ఇంటర్నెట్, విద్యుత్తు బిల్లుల సైతం అందడం లేదు.
Election Stunt ఇన్నాళ్లు ముస్లిం యువతకు కంప్యూటర్ శిక్షణ దూరం చేయడమేగాక... అక్కడ పనిచేసే సిబ్బందికి జీతభత్యాలు కూడా చెల్లించని ప్రభుత్వం.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓట్ల రాజకీయానికి తెరలేపింది. ఈ నెలాఖరు నుంచి శిక్షణ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజకీయ అవసరాలు తప్ప.. ప్రజా సంక్షేమం పట్టని జగన్ సర్కారు అప్పట్లోనే స్పందించి ఉంటే వేలాది ముస్లిం కుటుంబాలకు ఉపాధి దొరికేది.
Prathidhwani: నాలుగేళ్లలో ముస్లింలకు వైసీపీ సర్కార్ చేసిందేమిటి?