International Awards in Karrasamu 2023 : ప్రాచీన యుద్ధకళకు ప్రాచుర్యం కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఈ క్రీడాకారులు. ఒకవైపు శిలంబం విద్యలో శిక్షణ పొందుతూనే ఇతరులకూ తర్ఫీదిస్తున్నారు. కర్రసాము, కత్తిసాముల్లో అద్భుతవిన్యాసాలు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. నిత్యం కఠోర సాధన చేస్తూ... అంతర్జాతీయ పోటీల్లో పతకాలు రాబడుతున్నారు. వృత్తినీ, ప్రవృత్తినీ సమన్వయపరచుకుంటూ.. గెలుపు బాటలో పయనిస్తున్నారు.
పతకాలు సాధించిన క్రీడాకారులకు గుడ్న్యూస్.. ప్రోత్సాహక బకాయిలు రూ. 4.29 కోట్లు విడుదల
Vijayawada Karrasamu Players Won Many Awards 2023 : ఎంతో సాధన ఉంటేగానీ... కర్రసాము, కత్తిసాము చేయలేరు. కానీ....ఈ క్రీడాకారులను చూడండి.... కర్రను గిరగిరా తిప్పుతూ ఎలా విన్యాసాలు చేస్తున్నారో... వీరందరూ వేర్వేరు వృత్తుల్లో స్థిరపడినవారే. కానీ...వీళ్లని ఒకచోటికి చేరేలా చేసింది మాత్రం శిలంబమే. వ్యాయామం కోసం ఇందిరాగాంధీ స్టేడియానికి వచ్చేవారు...అలా గ్రౌండ్‌లో కొంతమంది కర్రసాము సాధన చేయడం చూశాక... తామూ వారిలానే ఈ విద్యను అభ్యసించాలనుకున్నారు. అందుకు శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టిన రెండు మూడేళ్లకే... కర్రసాము, కత్తిసాములపై మంచి పట్టు సొంతం చేసుకున్నారు.
'ఆటల్లేవ్.. ఆడుకోవడాల్లేవ్.. అయినా ఐపీఎల్ కల'
'కర్నూలు జిల్లాకు చెందిన నేను పేద కుటుంబంలో పుట్టినా... కష్టపడి కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాను. ప్రస్తుతం విజయవాడ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తూన్నాను. చిన్నతనంలోనే నాలో ఎంతో ఆసక్తి రేకెత్తించిన శిలంబాన్నీ అభ్యసిస్తున్నాను. రాష్ట్రస్థాయి డబుల్, సింగిల్ స్టిక్‌లో రజత పతకాలు సాధించాను. ఇటీవల దక్షిణాసియా క్రీడల్లోనూ వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాను.' -రమేష్ , కానిస్టేబుల్
అరవైల్లోనూ ఇరవైలా.. యువతకు స్ఫూర్తిగా.. వెటరన్ క్రీడాకారులు
'నేను శ్రీకాకుళం వాస్తవ్యున్ని. ఆర్మీలో పదేళ్ల పాటు దేశరక్షణ కోసం పనిచేశాను. ఇప్పుడు విజయవాడలో ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాను. స్వతహాగా ఆటలంటే మక్కువ ఉండేది ఆ కారణంగానే నా దృష్టి ఇటువైపు మళ్లాను. రాష్ట్రస్థాయి శిలంబం పోటీల్లో బంగారు పతకాన్ని, దక్షిణాసియా పోటీల్లో రజతాన్నీ సాధించాను.' -
ఖైగేశ్వరరావు , ప్రభుత్వ ఉద్యోగి
'మాది ఏలూరు జిల్లా గొల్లగూడెం. నాకు ఆటలంటే ఎంతో ఇష్టం. అలా ఆటల పట్ల ఆసక్తితో పీఈటీ మాస్టారుగా మారాను. కర్రసాములో రెండేళ్ల సాధన అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. బెంగళూరులో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకం గెలుచుకున్నాను. ఇది చాలా ఆనందకరంగా ఉంది.' -మధుబాబు ,పీఈటీ
'భద్రాచలం నా స్వస్థలం. పోటీ పరీక్షల కోసం విజయవాడ వచ్చాను. శిలంబం వల్ల మహిళల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. భద్రాచలంలో ఓ పాఠశాలలో విద్యార్ధులకు శిలంబంలో శిక్షణనిస్తూనే... కర్రసాము పోటీల్లో పతకాలు సాధించడం ఎంతో గర్వంగా ఉంది.' -హారిక , శిలంబం క్రీడాకారిణి
'నా దగ్గర శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం శుభ పరిణామం. నిరంతరం క్రమశిక్షణతో సాధన చేయడం వల్లే ఈ విజయాలు దక్కాయి.' -సత్య శ్రీకాంత్ ,శిలంబం శిక్షకుడు
పట్టుదల, ఏకాగ్రత, సమయపాలనతో ముందుకు సాగితే విజయాలు పొందడం కష్టమేమీ కాదని రుజువు చేస్తున్నారు ఈ శిలంబం క్రీడాకారులు. ప్రభుత్వం తగిన చేయూతనందిస్తే మరిన్ని పతకాలు తెస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.