కృష్ణా జిల్లాలో తొలిసారిగా ఏడుగురు ట్రాన్స్ జెండర్స్కు గుర్తింపు కార్డులను కలెక్టర్ ఇంతియాజ్ అందజేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్కు గుర్తింపు కార్డులు, ధృవపత్రాలను ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలతో పాటు అఫిడవిట్ సైతం ఆన్లైన్లో పొందు పరచాలని కలెక్టర్ సూచించారు. మళ్లీ లింగమార్పిడి చేసుకుంటే వివరాలను అప్డేట్ చేయాలన్నారు.
ఇదీ చదవండి: