ETV Bharat / state

HEAVY TRAFFIC: రోడ్డుపై నిలిచిన లారీ.. గుడివాడ-పోలుకొండ రహదారిపై నిలిచిన ట్రాఫిక్ - TELUGU NEWS

lorry repair at gudivada-polukonda highway: కృష్ణా జిల్లా నందివాడ మండలం గుడివాడ - పోలుకొండ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రిపేర్​ కారణంగా రోడ్డుపై లారీ నిలిచిపోయింది. దీంతో రోడ్డుకిరువైపులా కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.

heavy-traffic-in-krishna-district
గుడివాడ-పోలుకొండ ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్
author img

By

Published : Dec 29, 2021, 11:52 AM IST

గుడివాడ-పోలుకొండ ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్

heavy traffic jam at gidivada-polukonda highway: కృష్ణా జిల్లా నందివాడ మండలం గుడివాడ - పోలుకొండ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ రహదారిలో తమిరిశ గ్రామం వద్ద మరమ్మతుల కారణంగా ఆక్వా ఉత్పత్తుల లారీ రోడ్డుపైనే నిలపాల్సి వచ్చింది. ఈ లారీ అడ్డుగా ఉండడంతో.. కిలోమీటర్ మేర రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలుకొండ రహదారి మార్జిన్ పనులను ఆరు నెలలుగా కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేయడంతో ఇరుకుగా ఉన్న రహదారిపై, తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది.

ఆక్వా సాగు అధికంగా ఉండే ప్రాంతాలు కావడంతో దాణా, ఆక్వా ఉత్పత్తులు రవాణా కోసం ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ దారి గుండానే వెళ్తాయి. దీంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:

CBN LETTER TO DGP: 'వంగవీటి రాధకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.