కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్టేషన్ పరిధిలో రవాణాకి సిద్ధంగా ఉన్న నిషేధిత గుట్కా, కైనీ ప్యాకెట్లని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు నిందితులతో పాటు ఓ బోలేరో వాహనం, ఒక లారీ, రూ.18 లక్షల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్ల బ్యాగులు పట్టుబడ్డాయి. ఒడిశా కేంద్రంగా తయారవుతున్న ఈ గుట్కా ప్యాకెట్లను ఉయ్యూరుకి చెందిన కోపూరీ కాంతారావు మరో ఇద్దరితో కలిసి రాత్రి వేళ్లలో కోనుగోలు చేస్తున్నట్లు సమాచారం రావటంతో దాడులు నిర్వహించినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: