రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు కలిసి చందర్లపాడు మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇవ్వటంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదని చెప్పి ఇప్పుడు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
తరువాత రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి పెట్టుబడుల సమయంలో బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. బంగారంపై రుణాలు తీసుకున్న రైతులు కూడా వడ్డీ కట్టాల్సిందేనన్న నోటీసు ఇంటికి పంపిస్తున్నారన్నారు. వడ్డీలేని రుణాలు మంజూరు చేయకుంటే.. ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: