ETV Bharat / state

ఏడేళ్ల కుమార్తెని చంపిన తండ్రి

కన్న తండ్రే.. తన పాలిట యముడవుతాడని ఆ చిన్నారికి తెలియలేదు. తండ్రి కిరాతకాన్ని ఏమాత్రం పసిగట్టినా.. ఏదోరకంగా తప్పించుకునేందుకు ప్రయత్నించి ఉండేదేమో..! తలపై చేయి వేస్తే.. ప్రేమతో నిమురుతున్నాడని అనుకుందేమో ఆ చిన్నారి.. కానీ తలని గట్టిగా దిండుకు అదిమి ఊపిరాడకుండా చేస్తాడని ఊహించలేకపోయింది.

father kills daughter
కుమార్తెని చంపిన తండ్రి
author img

By

Published : Apr 30, 2021, 9:09 AM IST

కన్న తండ్రి చేతిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన విజయవాడలోని కొత్తపేట మాకినవారి వీధిలో జరిగింది. కొత్తపేట చదును మహాలక్ష్మి అమ్మవారి గుడి సమీపంలోని మాకినవారి వీధిలో జగ్గుపిళ్ల రాజా(35), యుగంధరి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 7 సంవత్సరాల కుమార్తె ఉంది. యూకేజీ వరకు చదివి, కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటుంది.

రాజా గొల్లపూడిలో ఓ మెడికల్‌ షాపులో పని చేసేవాడు. 3 నెలలుగా పనికి వెళ్లడం లేదు. పని చేయకపోతే ఇంటి ఖర్చులు ఎలా అంటూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 28న ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో వివాదాన్ని వచ్చే ఆదివారం పెద్దల సమక్షంలో పెడతానని భార్య చెప్పింది. గురువారం మధ్యాహ్నం యుగంధరి తన కుమార్తెను తీసుకుని ఆ పక్కనే నివాసం ఉండే తల్లి ఇంటికి వెళ్లింది. రాజా తన భార్యకు ఫోన్‌ చేసి కుమార్తెను ఇంటికి పంపమని చెప్పాడు. ఆ చిన్నారిని ఇంటికి పంపిన వెంటనే తల్లి కూడా వచ్చింది. భర్తతో మాట్లాడిన కాసేపటికి తిరిగి తల్లి ఇంటికి వెళ్లింది.

కుమార్తె మంచంపై బోర్లా పడుకుని దిండుపై రెండు చేతులు పెట్టుకుని తల పైకెత్తి చరవాణిలో గేమ్స్‌ ఆడుకుంటోంది. తండ్రి రాజా ఏమనుకున్నాడో ఏమో.. ఆ చిన్నారి తలపై చేతులు పెట్టి అడుగున ఉన్న దిండుకు గట్టిగా ఆదిమాడు. గిలగిల కొట్టుకుంటూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. మరికాసేపటికే తల్లి ఇంటికి వచ్చే సరికి కుమార్తె విగతజీవురాలై పడి ఉండటాన్ని చూసి చుట్టుపక్కల వారి సాయంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. వారితో పాటు తండ్రి కూడా ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా చిన్నారి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విశ్వనాథ్‌ తెలిపారు. నిందితుడిని విచారిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

కిరాతకం: కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన వాళ్లని వదల్లేదు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.