కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పత్తి పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో లక్షా 30 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా... నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నూజివీడు నియోజకవర్గాల్లో అత్యధికంగా సాగు చేశారు. వర్షాల వల్ల కాయలు, పిందెలు, పూత పూర్తిగా రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి వస్తుందనే ఆశ లేకపోవడంతో కొంతమంది రైతులు పత్తి పైర్లు పీకేస్తున్నారు. కంచికచర్ల మండలం మోగులూరు, మున్నలూరు గ్రామంలో సుమారు 20 ఎకరాల్లో పత్తి పంటను తొలగించారు. దీంతో ఎకరానికి కౌలుతో కలుపుకొని 50 వేల వరకు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...