ప్రభుత్వం ప్రకటిస్తున్న కోవిడ్ లెక్కలకు వాస్తవ పరిస్థితుల మధ్య చాలా తేడా ఉందని కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకొచ్చి కరోనా బారినపడొద్దని సూచించారు. కరోనా కారణంగా హోం ఐసొలేషన్‌లో ఉంటూ వైద్యం పొందుతున్నారని... ఏ లక్షణాలు లేకపోయినా కొందరికి పాజిటివ్ వస్తోందని.. లక్షణాలున్న వారికి నెగెటివ్‌గా రిపోర్టులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కరోనా సామాజిక వ్యాప్తి చెందిందని...అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు బయటకొచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి