ETV Bharat / state

అవనిగడ్డలో వలస కూలీలకు నిత్యావసరాలు, నగదు అందజేత - lockdown

లాక్​డౌన్ నేపథ్యంలో ఆర్థింగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు తమ వంతు సహాయం అందిస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటునందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో వలస కూలీలకు స్థానిక రెవెన్యూ అధికారులు నిత్యావసరాలు, నగదు పంపిణీ చేశారు.

Essential needs and cash donations for migrant laborers in Avinigadda
అవనిగడ్డలో వలస కూలీలకు నిత్యావసరాలు, నగదు అందజేత
author img

By

Published : Apr 8, 2020, 7:32 PM IST

కృష్ణాజిల్లా అవనిగడ్డలో రెవెన్యూ అధికారులు 71మంది వలస కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కుటుంబానికి పది కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కారం, మంచినూనె, ఉప్పు, కూరగాయలను స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతులు మీదుగా కూలీలకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతికదూరం పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, రేషన్ డీలర్లు, గ్రామ రెవిన్యూ అధికారుల సహాయంతో నగదు అందజేశారు.

ఇదీ చదవండి.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి.. లేదంటే అరెస్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.