విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ సన్నిధిలో ఆషాడ సారె వేడుక వైభవంగా ముగిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. సుమారు 3లక్షల మంది భక్తులు వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కోటేశ్వరమ్మ తెలిపారు. చివరిరోజున ఆలయ అర్చకుల బృందాలు కుటుంబ సమేతంగా ఆషాడసారె సమర్పించారు. ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న ఆనంతరం మహామంటపంలో వేంచేసిఉన్న దుర్గమ్మ ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు. సారెతో పాటు 100 గ్రాముల కంఠాభరణాన్ని బహుకరించారు. కొండపైన ఆషాడ మాస ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని... శుక్రవారం నుంచి శ్రావణమాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. శ్రావణమాసంలో వరలక్ష్మీ దేవిగా అమ్మవారు భక్తులకు అభయమిస్తారని తెలిపారు. మహిళలకు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, లలితా సహస్రనామ పారాయణాలు, కుంకుమార్చనాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుకున్నారు.
ఇది కూడా చదవండి.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు