కృష్ణా జిల్లా నూజివీడులోని కోట మహిషామర్ధిని అమ్మవారి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ కామాక్షి అమ్మవారు, కనకదుర్గమ్మ, అన్నపూర్ణ దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన మంగళవారం నాడు అన్నపూర్ణాదేవిగా జగన్మాత భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే కరోనా వృద్ధితో ఇప్పటికే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా దేవాలయాలకు హాజరయ్యే భక్తులు మరింతగా తగ్గారు. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించే భక్తులకు మాత్రమే దేవాలయాల్లోకి నిర్వాహకులు అనుమతిస్తున్నారు.
ఇవీ చదవండి: అన్నపూర్ణదేవిగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ