ETV Bharat / state

నటుడు రామ్​ ట్వీట్ చేస్తే పోలీసులు బెదిరించటం ఏంటి?: దేవినేని

రాష్ట్రంలో కుల వైరస్ అనే జబ్బు నడుస్తోందని సినీ నటుడు రామ్ ట్వీట్ చేస్తే పోలీసులు అతడిని బెదిరించడమేంటని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కరోనా వైరస్ కన్నా కులవైరస్ అనే పెద్ద జబ్బు రాష్ట్రంలో నడుస్తోందన్న వ్యాఖ్యలు వాస్తవమని దేవినేని అన్నారు.

devineni uma fires on ycp about hero ram tweet case
నటుడు రామ్​ ట్వీట్ పెడితే పోలీసులు బెదిరించటం ఏంటి? : దేవినేని
author img

By

Published : Aug 18, 2020, 4:13 PM IST

కరోనా వైరస్ కన్నా కుల వైరస్ అనే పెద్ద జబ్బు రాష్ట్రంలో నడుస్తోందన్న నటుల వ్యాఖ్యలు వాస్తవమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. సినీ నటుడు రామ్ ట్వీట్ చేస్తే, పోలీసులు అతడిని బెదిరించడమేంటని నిలదీశారు. వైద్యులను, వారి కుటుంబసభ్యులను, బంధువులను, పెట్టుబడిదారులను, అందరినీ బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తుంటే, ఇక్కడున్న ఆసుపత్రుల్ని ప్రభుత్వం కక్షసాధింపు చర్యలతో మూసి వేయిస్తోందని దేవినేని ఆరోపించారు.

విచారణ పేరుతో పోలీసుల వీరంగం

డాక్టర్ రమేశ్​బాబుగా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి, ప్రభుత్వానికి మాత్రం రమేశ్ చౌదరిగా కనిపించారని విమర్శించారు. రాష్ట్ర పోలీసులు హైదరాబాద్​లోని రమేశ్ ఇంటికి వెళ్లి, 86ఏళ్ల వృద్ధురాలిపై విచారణ పేరుతో వీరంగం చేశారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడికి వైద్యం చేశారని రమేశ్​బాబుపై ప్రభుత్వం కక్ష కట్టిందా లేక ఆయన చంద్రబాబునాయుడితో కోవిడ్​పై మాట్లాడారని కక్ష సాధింపులకు పాల్పడుతుందా అని నిలదీశారు.

స్వర్ణ ప్యాలెస్​ను క్వారంటైన్ కేంద్రంగా ప్రభుత్వమే నిర్వహించినప్పుడు, అందులో ఫైర్, ఇతరేతర వసతులున్నాయో లేదో తెలియదా అని ప్రశ్నించారు. జరిగిన దుర్ఘటనలో అసలు కుట్రదారులెవరో బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

ఆ గ్రామాలకు వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.