ఆజాది కా అమృత మహోత్సవంలో భాగంగా కృష్ణా జిల్లా కూచిపూడి శ్రీ భరతముని నాట్య ఉత్సవాల్లో మూడో రోజూ ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక వనరులు-శిక్షణా సంస్థ, కూచిపూడి యక్షగానం కేంద్రం ఆధ్వర్యంలో.. ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
సాంస్కృతిక వనరులు శిక్షణా సంస్థ అవార్డు గ్రహిత.. అమృత అవసరాల అమృత వర్షిణి రాగం ఆది తాళంలో పుష్పాంజలి అంశాన్ని నర్తించి ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి శ్రీ సిద్ధేంద్రయోగి కళా పీఠం ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి రచించి దర్శకత్వం వహించిన.. గోదా కల్యాణం యక్షగానం రూపకాన్ని కళా పీఠం విద్యార్థులు ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపచేశారు.
ఇదీ చదవండి