పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం ఆరోపించింది. కృష్ణాజిల్లా నందిగామ రైతుబజార్ వద్ద సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఉల్లి ధరలను తగ్గించాలనీ.. రేషన్ షాపుల ద్వారా ఉల్లిని అందజేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి భారంగా మారాయన్నారు. వాటి ధరలను తగ్గించి సామాన్యులకు అందుబాటులో ఉంచాలని కోరారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలనూ తగ్గించాలన్నారు.
ఇవీ చదవండి..