ETV Bharat / state

'ఈఎస్​ఐ ఆసుపత్రి అవకతవకలపై విచారణ జరిపించాలి' - విజయవాడలో సీపీఎం ధర్నా

కార్మిక రాజ్య బీమా సంస్థ ఆసుపత్రిలో జరిగిన అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్​ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా చేపట్టారు.

CPM Dharna for investigate ESI hospital manipulations in vijayawada, krishna
ఈఎస్​ఐ ఆసుపత్రి కుంభకోణంపై సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
author img

By

Published : Feb 22, 2020, 2:11 PM IST

ఈఎస్​ఐ ఆసుపత్రి కుంభకోణంపై సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో నాయకులు ధర్నా చేశారు. ఐదేళ్లలో ఆసుపత్రిలో మందులు.. ఇతర అంశాలపై జరిగిన అవినీతి వ్యవహారాన్ని వెలికి తీసి వెంటనే శిక్షించాలని డిమాండ్​ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబూరావు హెచ్చరించారు. కార్మికుల కష్టాన్ని పణంగా పెట్టి నడిపే ఈఎస్ఐ ఆస్పత్రిలో.. అవినీతిపరులను ఉపేక్షిస్తే కార్మికుల హక్కులకు భంగం కలిగినట్లేనని మండిపడ్డారు. వెంటనే ఉన్నత స్థాయి విచారణ చేపట్టి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

ఇదీ చదవండి:

సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించండి: ఎంపీ గల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.