రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 35,375 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 310 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు కేసులు నమోదు కాలేదు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51, అత్యల్పంగా విజయనగరంలో 7 మందికి వైరస్ సోకినట్లు పేర్కొంది. కర్నూలు 21, తూర్పుగోదావరి, విశాఖపట్నం 43, గుంటూరు 28, అనంతపురం, కృష్ణా 26, నెల్లూరులో 13, ప్రకాశంలో 12, కడప, శ్రీకాకుళంలో 20 చొప్పున కొవిడ్ నిర్ధరణ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలో వైరస్ నుంచి మరో 114 మంది బాధితులు కోలుకోగా మరో ఇద్దరు మరణించారు. తాజా గణాంకాలతో కలిపి.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,94,044 మందికి కొవిడ్ సోకింది. 7,191 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2,382 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇవీ చదవండి: