కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ ఆరోపించారు. పెరిగిన ధరలను తగ్గించాలని కోరుతూ.... ఈనెల 7 నుంచి 17 వరకు ఏఐసీసీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేసులకు భయపడి సీఎం జగన్ కేంద్రం మాటలను అనుసరిస్తున్నారని మస్తాన్ వలీ వ్యాఖ్యానించారు. ప్రజలను మభ్య పెట్టేందుకు జల వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తూ... సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ అసమర్థ పాలన వల్ల అమరావతి ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆక్షేపించారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన రైతులను అరెస్టు చేయించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.