ETV Bharat / state

'సామాజిక దూరం పాటిస్తాం... అమరావతి కోసం పోరాడతాం' - ap amaravathi farmers protest on capital

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రాజధాని అమరావతి కోసం మందడం రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసేంతవరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

'సామాజిక దూరాన్ని పాటిస్తాం... అమరావతి కోసం పోరాడతాం'

author img

By

Published : Mar 24, 2020, 5:41 PM IST

'సామాజిక దూరం పాటిస్తాం... అమరావతి కోసం పోరాడతాం'

మందడంలో రాజధాని రైతుల నిరసన 98వ రోజుకు చేరుకుంది. రైతులు, మహిళలు, చిన్నారులు శిబిరాల్లో కొద్ది మంది మాత్రమే దీక్ష చేస్తున్నారు. మిగిలిన వారంతా తమ ఇళ్లలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి నిరసనలు కొనసాగిస్తున్నారు. వైద్యులు, ప్రభుత్వం ఇచ్చిన సలహాలను పాటిస్తూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కరోనాను అరికట్టేందుకు తమవంతు సాయం చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రైతులు, మహిళలు కరోనా దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతి ఐకాస కన్వినర్ పువ్వాడ సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి

ఆగని రాజధాని రైతుల ఆందోళనలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.