కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు రాష్ట్ర సరిహద్దు వద్ద హైదరాబాదు నుంచి బస్సులో వస్తున్న 36 మందిని పోలీసులు అడ్డుకున్నారు. తామంతా ఖతార్లో ఎలక్ట్రికల్ పనులకు వెళ్లి హైదరాబాద్ వచ్చామని.. అక్కడ 14 రోజులు క్వారంటైన్లో ఉన్నట్లు వారు చెప్పారు. క్వారంటైన్ పూర్తయినందున స్వస్థలాలకు బయలుదేరామని తెలిపారు. అయితే, ఏప్రిల్ 14 వరకు ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి ఎవరికీ అనుమతి లేనందున వారి బస్సును అక్కడే ఆపేసినట్లు నందిగామ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
ఇవీ చదవండి.. పిడుగులు పడే ప్రమాదం ఉంది... జాగ్రత్త