ETV Bharat / state

BLOOD DONATION: రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు - రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. పలువురు స్వచ్ఛందగా రక్తదానం చేశారు. కరోనా సమయంలో సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి సహకారం అందించాలన్నారు.

BLOOD DONATION: రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు

author img

By

Published : Jun 14, 2021, 6:42 PM IST

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలో రాయల్ యూత్ ఫెడరేషన్, ప్రగతి పదం యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 40 మంది యువత రక్తదానం చేశారని వారికి సభ్యులు అభినందనలు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి యువత రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.. బ్లడ్ డొనేట్ చేస్తున్నవారికి సర్టిఫికెట్స్ అందజేశారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

విజయనగరంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేట్ చేయటానికి ప్ర‌తీఒక్క‌రూ ముందుకు రావాల‌ని ఇండియ‌న్‌ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మ‌న్ కేఆర్‌డీ ప్ర‌సాద‌రావు కోరారు. ఆరోగ్య‌వంతులైన వారు ప్ర‌తీ మూడు నెల‌ల‌కూ ఒక‌సారి ర‌క్త‌దానం చేయ‌వ‌చ్చున‌ని సూచించారు. ర‌క్త‌దానంపై అపోహ‌ల‌ను విడ‌నాడాల‌ని, ఆరోగ్య‌వంతులంతా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి, ర‌క్త దాత‌లుగా త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం మల్లవరం గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. లైన్స్ క్లబ్ సభ్యులు సామాజిక కార్యకర్త ధూళిపూడి బాబీ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు పది మంది యువతీ యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు..

విశాఖ ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా..స్వచ్చంద రక్తదాతలకు విశాఖ నగర మేయర్ జి హరి వెంకట రమణ కుమారి సత్కరించారు.. జీవీఎంసీ మేయర్ ఛాంబర్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్త దానం వల్ల ప్రాణాలు కాపాడినట్టేనని మేయర్ చెప్పారు. రక్తదాతలను ప్రోత్సహించాలనే ఈ కార్యక్రమం చేసినట్టు చెప్పారు.

ఇవీ చదవండి

World Blood Donor Day: ఈ రక్తదాతలు.. ప్రాణాపాయంలో పునర్జన్మ ప్రదాతలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.