ETV Bharat / state

BLO Responsibilities Village Ward Women Police: ఓటరు జాబితాలో పోలీస్ జోక్యం.. బీఎల్‌ఓ బాధ్యతల అప్పగింత.. పారదర్శకతకు పాతర! - Four Police Officers Suspended for illegal votes

BLO Responsibilities to Village and Ward Women Police: రాష్ట్రంలో గ్రామ, వార్డు మహిళా పోలీసులకు.. బీఎల్‌ఓ బాధ్యతలు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా ఉపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బందికి అప్పగించే ఈ బాధ్యతల్ని.. పోలీసుల కనుసన్నల్లో పనిచేసే గ్రామ, వార్డు మహిళా పోలీసులకు ఎలా ఇస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్చూరు ఘటన కళ్లముందే కనబడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకత ఎలా వస్తుందనే అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి.

BLO_Responsibilities_to_Village_and_Ward_Women_Police

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 12:25 PM IST

BLO Responsibilities to Village and Ward Women Police: గ్రామ, వార్డు మహిళా పోలీసులకు బీఎల్‌ఓ బాధ్యతలు.. ఓటర్ల జాబితా తయారీలో చిత్తశుద్ధి ఎలా?

BLO Responsibilities to Village and Ward Women Police : అధికారంలోకి వచ్చాక 15 వేల మంది గ్రామ, వార్డు మహిళా పోలీసుల్ని నియమించామని సీఎం జగన్, మంత్రులు చాలా సార్లు చెప్పారు. అందువల్ల తమకు విశ్వాసంగా పనిచేయాలని సచివాలయ సిబ్బందికి బహిరంగంగానే చెప్పిన పరిస్థితి. అలాంటి వారికి ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులు చేసే బీఎల్‌ఓ బాధ్యతల్ని అప్పగిస్తే.. పారదర్శకత ఎలా ఉంటుంది. వారిని కాపాడటానికి తామున్నామని ఏకంగా ప్రభుత్వ పెద్దలే అభయహస్తమిస్తుంటే ఇక రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం ఎలా సాధ్యం?

WhatsApp Group With Village and Ward Women Police : నచ్చనివారి ఓట్లు గంపగుత్తగా తొలగిస్తూ, నచ్చిన వారి ఓట్లను మాత్రం పెద్దఎత్తున చేరుస్తూ పోతుంటే.. సామాన్యుడి ఓటు మాటేంటి? బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జరిగింది అదే. మార్టూరు సీఐ, ఎస్సైలు.. వైసీపీ ప్రతినిధుల్లా, ఆ పార్టీ బూత్‌ ఏజెంట్లలా వ్యవహరిస్తూ.. గ్రామ, వార్డు మహిళా పోలీసులతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. రోజువారీ ఎన్ని ఓట్లు తొలగించారనే వివరాలను సేకరించారు. ప్రతిపక్షాలకు చెందిన సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. రాష్ట్రంలోని మరెన్నో నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అయినా ఎన్నికల అధికారులు మాత్రం అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారు. అరకొర సమాచారంతో న్యాయస్థానాల్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు.

Four Police Officers Suspended: పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలు.. సస్పెన్షన్‌ వేటుతో సరిపెట్టేశారు

BLOs Send Information to Police Against Rules : పర్చూరు నియోజకవర్గ పరిధిలో 295 మంది బీఎల్‌వోలు ఉండగా వారిలో 64 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులే. గ్రామ సచివాలయ పరిధిలో ఫారం-7 దరఖాస్తులు (Form-7 Applications) ఎన్ని పూర్తయ్యాయో.. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల లోపు గ్రూపులో పోస్టు చేయండని సీఐ స్థాయి అధికారి పోస్టు చేశారు. గ్రామాలవారీ మహిళా సంరక్షణ కార్యదర్శులు తమ పరిధిలోని ఆ వివరాలను ఇచ్చారు. పలువురు బీఎల్‌వోలు నిబంధనలకు విరుద్ధంగా, అనధికారికంగా ఆ సమాచారాన్ని ఎస్సైలకు, సీఐలకు, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు పంపించారు.

Police Interference in Voter Registration Process in AP : ఇది కచ్చితంగా ఓటరు జాబితా ప్రక్రియలో పోలీసులు జోక్యం చేసుకోవడమే. అందుకు సాక్ష్యాలూ పక్కాగా ఉన్నాయి. గతంలో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయిలో పని చేసే ఇతర సిబ్బందిని బీఎల్‌ఓ(BLO)లుగా నియమించేవారు. పోలీసులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. ఓటర్ల నుంచి సేకరించిన సమాచారం, వివరాలను బీఎల్‌వోలు కేవలం ఈఆర్‌వోకి మాత్రమే ఇవ్వాలి. అయితే ఇప్పుడు మాత్రం పోలీసుశాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహిళా పోలీసుల్ని నియమించడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తింది.

Double Votes in Macharla: మాచర్లలో అధికార పార్టీ నేతల డబుల్ ధమాకా.. 5వేల మందికి రెండేసి ఓట్లు

విమర్శలు రావడంతో సస్పెన్షన్‌ : పర్చూరు ఘటనలో ఓట్ల తొలగింపు, నమోదు దరఖాస్తుల వల్ల గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉందని.. అందుకే ఎక్కడెక్కడ ఎవరెవరు దరఖాస్తు చేశారనే సమాచారం తీసుకుని ఉన్నతాధికారులకు పంపించామని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనేదే తమ ఉద్దేశమని.. మార్టూరు, పర్చూరు, యద్ధనపూడి ఎస్సైలు వివిరణ ఇచ్చారు. దీనిపై అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. ఇలాంటి అధికారులపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఇక్కడ ప్రశ్న. వాట్సప్‌ సాక్ష్యాలు.. ప్రతికూలంగా ఉండటంతో తొలుత బీఎల్‌ఓలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. తర్వాత.. సీఐ, ఎస్సైలను వీఆర్‌కు పంపారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సస్పెన్షన్‌తో సరిపెట్టారు.

వైఎస్సార్సీపీ ముఖ్యనేత సూచనలు? : పర్చూరు నియోజకవర్గంలో నేర చరిత్ర కలిగిన వైసీపీ ముఖ్యనేత.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కుట్రలు ప్రారంభించారు. ప్రతిపక్ష నేతలను వేధించడం (Harassing Opposition Leaders)తో పాటు వారిపై కేసులు పెట్టించి.. నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా పోలీసుల ద్వారా ఒత్తిడి తేవడంలో ఆరితేరారనే పేరు ఆయనకు గతం నుంచీ ఉంది. వచ్చీ రావడంతోనే గ్రానైట్‌ రంగాన్ని కొన్నాళ్ల పాటు స్తంభింపజేసి.. వచ్చే ఎన్నికలకు సరిపడా సొమ్ము సమకూర్చుకున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కొంతకాలంగా పర్చూరు నియోజకవర్గంలోనూ పోలీసుల ద్వారా.. ప్రతిపక్షానికి చెందిన ఓట్ల తొలగింపునకు ప్రణాళిక అమలు చేశారు. బీఎల్‌ఓలపై ఒక కన్నేసి ఉంచాలని.. పోలీసులకు సూచించడంతో వారు మరింత రెచ్చిపోయి అధికారపార్టీ కార్యకర్తల్లా పనిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Cases Filed on False Form 7 Applicants అధికార పార్టీ నయా ఆయుధం ఫారం-7! కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.