అమరావతిలో కొన్ని గ్రామాలకు చెందిన స్థానికులు, రైతులు కొద్దిరోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. కొంతమంది ఆందోళనకారులు... విధులు నిర్వహిస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారని గుంటూరు ఐజీ వినాత్ బ్రిజ్లాల్ పత్రికా ప్రకటనలో తెలిపారు. పోలీసులపై కవ్వింపు చర్యలకు పాల్పడినా.. వారిని అసభ్య పదజాలంతో దూషించినా, భౌతిక దాడులకు దిగుతున్నా... చర్యలు తీసుకుంటామని ఐజీ తెలిపారు. గుంటూరులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డిపై జరిగిన ఆందోళనలో అంగరక్షకుడుపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో భాగంగా దాడి నుంచి ఎమ్మెల్యేను రక్షిస్తున్న క్రమంలో... అతనిపై ఉద్దేశపూరకంగా దాడి చేయటం సరికాదన్నారు. ఇటువంటి ఘటనలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి చేసిన రైతులపై కేసులు