ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే చంద్రబాబుపై రాళ్లదాడి జరిగిందని మాజీ మంత్రి కళా వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్ని దాడులు చేసినా తిరుపతి లోక్సభలో వైకాపాకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అధికార పార్టీ అవలంభిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి రాళ్ల దాడే సాక్షమని మండిపడ్డారు.
'చేతకాక'
తమ పనితీరుతో రాష్ట్ర ప్రజలను మెప్పించి ఓట్లు పొందడం చేతగాక.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా అధినేత సభలకు తగిన రక్షణ కల్పించాలని పోలీస్ శాఖను కోరారు.