కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ నిర్వహించిన వేలంలో.. ఝార్ఖండ్ కు చెందిన బ్రహ్మదిహా కోల్ బ్లాక్‌ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఝార్ఖండ్ రాష్ట్రలోని గిరిదిహ్ కోల్ ఫీల్డ్‌లో బ్రహ్మదిహా కోల్ బ్లాక్ ఉంది. 259 ఎకరాల పరిధిలోని ఈ బ్లాక్‌లోని కోకింగ్ కోల్ బొగ్గును ఏపీఎండీసీ ఏడాదిపాటు మైనింగ్ చేయనుంది. ఈ బ్లాక్ నుంచి మొదటి గ్రేడ్ రకానికి చెందిన కోకింగ్ కోల్‌ను ఏడాదికి 0.15 మిలియన్ టన్నుల మేర తవ్వి తీసుకునేందుకు అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: