ETV Bharat / state

Sailajanath on Modi: ప్రధాని మోదీ వ్యాఖ్యలు అసంబద్ధం: శైలజానాథ్

Sailajanath fire on AP: విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర విభజనపై అసంబద్ధ వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

APCC president Sailajanath
APCC president Sailajanath
author img

By

Published : Feb 8, 2022, 10:22 PM IST

విభజన హామీలు అమలు చేయకుండా ఏడు సంవత్సరాలుగా కాలయాపన చేసిన భాజపా ప్రభుత్వం..కాంగ్రెస్​పై మాట్లాడడం దుర్మార్గమని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర విభజనపై అసంబద్ధ వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్​లో కబుర్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రధాని మోదీ వ్యాఖ్యలు అర్థరహితమని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదాతో పాటు పునర్విభజన సమయంలో హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశాన్ని నాశనం చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని, ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదన్న అంశాన్ని ప్రధాని మోదీ గుర్తించాలని హితవు పలికారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ.. కాంగ్రెస్ అని, అంతటి మహోన్నత పార్టీని విమర్శించటం సరికాదన్నారు. అయినా మోదీ పాలనలో ఏం ఒరిగిందని నిలదీశారు. పారిశ్రామికవేత్తలకు మేలు చేశారే తప్ప సామాన్యులకు ఏం చేశారని నిలదీశారు.

ఇదీ చదవండి:

మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారు: ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.